ప‌వ‌న్ ఎమోజీతో...


ఎమోజీ ఈ మాట‌ను మనం త‌రుచుగా వింటున్నాం. ఎమోజీ అంటే హీరో సినిమాకు సంబ‌ధించిన లుక్‌తో ట్విట్ట‌ర్ అకౌంట్ క్రియేట్ చేయ‌డ‌మే. త‌ద్వారా సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేసే అవ‌కాశం ఉండ‌టంతో సుల‌భంగా రీచ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ద‌క్షిణాదిన తొలిసారి ఎమోజీ క్రియేట్ అయిన చిత్రం `అదిరింది`. విజ‌య్ హీరోగా న‌టిస్తున్నాడు. తెలుగు, త‌మిళంలో సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌కానుంది. ఇప్పుడు ప‌వ‌న్ ఎమోజీ కూడా క్రియేట్ కానుంది. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాత‌వాసి`(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌).ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీలో ఎమోజీ క్రియేట్ కానుంది.