మూతి ముద్దుల పిల్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌...


అర్జున్ రెడ్డి చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎంత మంచి పేరొచ్చిందో, హీరోయిన్ షాలిని పాండేకు కూడా అంతే పెరొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌మిళంలో వెంట‌నే `100 % కాద‌ల్‌` సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. రెండో సినిమా రిలీజ్ కాకుండానే అప్పుడే మ‌రో అవ‌కాశం అందుకుంది అ అమ్మ‌డు. ఇంత‌కు ఈ అమ్మ‌డు కొత్త అవ‌కాశంతో కొత్త ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. షాలిని పాండే అడుగుపెట్ట‌నున్న ఇండ‌స్ట్రీ మాలీవుడ్‌. అది కూడా దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న‌. మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఇప్పుడు ఈ హీరో స‌ర‌స‌న షాలిని న‌టించ‌బోతుంది. ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా ఇత‌ర భాషా చిత్రాల నుండి అవకాశాల‌ను అందిపుచ్చుకుంటున్న షాలిని పాండేను అభినందించాల్సిందే.