హాట్ యాంక‌ర్ అవుట్‌...


జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్న ప్రోగ్రామ్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంది. మ‌ల్లెమాల మీడియా వాళ్లు తీసే ఈ ప్రోగ్రామ్‌ను ఈటీవీవారు ప్ర‌సారం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు కాన్సెప్ట్‌తో పాటు అన‌సూయ హాట్ అందాలు కుర్ర‌కారును ఆకట్టుకున్నాయి. అన‌సూయ సినిమాల్లో బిజీ కావ‌డంతో ఆమె స్థానంలో ర‌ష్మీ గౌత‌మ్ వ‌చ్చి చేరింది. ర‌ష్మీ కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ అన‌సూయ‌నే ఫాలో అయ్యింది. అయితే ఇప్పుడు విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం ర‌ష్మీ జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ని, ఆమె స్థానంలో హ‌రితేజ ఈ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ర‌ష్మీ బిగ్‌బాస్ సీజ‌న్‌లో పాల్గొంటుంది కాబట్టి షో నుండి త‌ప్పుకుంద‌ని, ఆమె స్థానంలో హ‌రితేజ వ‌చ్చి చేరింద‌ని చెప్పుకుంటున్నారు.