ప్రకాష్ రాజ్‌కు రంగు ప‌డుద్దా..?


రంగు ప‌డుద్ది..ఈ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఘ‌టోత్క‌చుడు సినిమాలో విల‌న్ న‌టించిన‌ ఏవీఎస్ డైలాగ్‌. రంగు ప‌డుద్ది అంటే అయిపోతావ్ అనే అర్థమ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ప్ర‌కాష్‌రాజ్‌కు కూడా రంగు ప‌డుద్దేమో చూడాలి. ఎందుకంటే..ప్రకాష్ రాజ్ చేయ‌బోబ‌యే క్యారెక్ట‌ర్ కార‌ణం కావ‌చ్చు. ఇంత‌కు అంత క‌ష్ట‌మైన క్యారెక్ట‌ర్ ఎంట‌బ్బా అని అనుకుంటున్నారా..? క‌్లిష్ట‌మైన క్యారెక్ట‌ర్ కాదు. ఇబ్బంది పెట్టే క్యారెక్ట‌ర్‌. అదే స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పాత్ర‌. రామ్‌గోపాల్ వ‌ర్మ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` అనే పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఎలా ఎదిగారు. చివ‌ర‌కు రాజ‌కీయంగా ఎలా వెన్నుపోటుకు గుర‌య్యారు. అనే విష‌యాల‌ను ప్ర‌ధానంగా చూపిస్తారు. వ‌ర్మ ఎన్టీఆర్‌పై సినిమా చేస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టి నుండి ఆస‌క్తి నెల‌కొంది. అస‌లు ఎన్టీఆర్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారో అంద‌రూ చూడాల‌నుకున్నారు. చివ‌ర‌కు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, ఎన్టీఆర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ని వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, ఎన్టీఆర్‌కు రాజ‌కీయంగా ద్రోహం చేసింది ఆయ‌న త‌న‌యుళ్లు, అల్లుళ్లే. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడు అంద‌రినీ కూడ‌గ‌ట్టి, ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని లాక్కున్నారు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇప్పుడు ఈ విష‌యాల‌ను వ‌ర్మ చూపిస్తాడు స‌రే, ముఖ్యంగా ప్ర‌కాష్ రాజ్‌కు స‌మ‌స్యేదీ రాదంటారా? క‌చ్చితంగా బెదిరిపులైతే వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. గ‌తంలో మండ‌లాధీశ్వ‌రుడు సినిమాలో ఎన్టీఆర్‌లా న‌టించిన కోట‌పై ఆప్ప‌ట్లో ఓ సామాజిక వ‌ర్గం క‌క్ష క‌ట్టింది. కోట‌ను ఇండ‌స్ట్రీలేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు కూడా చేసింది. ఇప్పుడు అలాంటి సిచ్చువేష‌నే ప్రకాష్‌రాజ్ ఫేస్ చేస్తాడేమో తెలియ‌దు కానీ..ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ప్ర‌కాష్ రాజ్‌పై గుర్రును ప్ర‌ద‌ర్శిస్తారు మ‌రి.