బాల‌య్య ముహుర్తబ‌లం ప‌నిచేస్తుందా..?


స్టార్ హీరోస్ అంద‌రూ జాత‌కాలు, ముహుర్తాల‌ను బాగానే న‌మ్ముతుంటారు. నంద‌మూరి బాల‌కృష్ణ అయితే ఈ విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటాడు. సాధార‌ణంగా బాల‌య్య త‌న చేసే సినిమాలు ప్రారంభోత్స‌వ ముహుర్తాలు, ఆడియో, విడుద‌ల స‌మ‌యాల ముహుర్తాల‌ను నిర్ణ‌యిస్తుంటారు. అయితే ఇప్పుడు తొలిసారి పూరి జ‌గ‌న్నాథ్ కోసం ఆయ‌న త‌న‌యుడు సినిమాకు ముహుర్తాన్ని నిర్ణ‌యించార‌ట బాల‌య్య‌. ఆయ‌న నిర్ణ‌యించిన ముహుర్తం ప్ర‌కారం ఆకాష్ పూరి సినిమా ఈరోజు ఉద‌యం 8.20 నిమిషాల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల ప్రారంభ‌మైంది. సందీప్ చౌతా సంగీతం అందించే ఈ ఇన్‌టెన్స్‌ ల‌వ్‌స్టోరీ 1971 ఇండో పాక్ నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ..అస‌లు బాల‌య్య ముహుర్త బ‌లాలు ప‌నిచేస్తాయంటారా? ఒక‌వేళ..అలాగే అనుకుని ఉండుంటే ఆయ‌న ముహుర్తం నిర్ణ‌యించిన డిక్టేట‌ర్, పైసా వ‌సూల్ చిత్రాలెందుకు నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చాయి. ముహుర్త‌బ‌లం కంటే క‌థా బ‌లం ఉంటేనే సినిమా విజ‌యం సాధిస్తుంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. మ‌రి పూరి క‌థా బలాన్ని న‌మ్మితే చాలు.