న‌మ్ర‌త అతి మ‌హేష్ చేటు తెస్తుందా..?


తెలుగులో కొన్ని అగ్ర ప‌త్రిక‌లు, ఛానెల్స్ వార్తాప‌త్రిక‌ల‌కు కొమ్ముకాస్తున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో చేస్తుంటాయి. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఆంగ్ల దిన‌ప‌త్రిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి దాదాపు ఏ పార్టీకి కొమ్ము కాయ‌వు. వాటికావ‌సరం కూడా రావు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే వీటికి అతీతంగా ఓ ప్ర‌ముఖ అంగ్ల ప‌త్రిక వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో మెగా హీరోల సినిమాలు, ఇత‌ర హీరోలైన మ‌హేష్‌, నంద‌మూరి హీరోల సినిమాలతో పోటీ ప‌డుతుంటాయి. ఈ పోటీ ఎలా మారిందంటే, ఇప్పుడు నిర్మాత‌లు ప్లాప్ అయిన సినిమాకు కూడా మా సినిమా సూప‌ర్‌హిట్ అంటున్నారు. ప‌బ్లిక్ టాక్‌కు భిన్న‌మైన క‌లెక్ష‌న్స్ చూపిస్తున్నారు. స‌రేన‌ని కొంత మంది విలేఖ‌రులు వారికున్న సోర్స్‌ల ద్వారా అస‌లు క‌లెక్ష‌న్స్ తెప్పిస్తే, వేయ‌కుండా వారి పై స్థాయివారు అడ్డుప‌డుతున్నార‌ట‌. వివ‌రాల్లోకెళ్తే..`డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` సినిమా విడుద‌లైన‌ప్పుడు మిక్స్‌డ్‌టాక్ వ‌చ్చింది. కానీ నిర్మాత‌లు రికార్డు క‌లెక్ష‌న్స్ అని ప్ర‌చారం చేశారు. అయితే ఆంగ్ల ప్ర‌ముఖ ప‌త్రిక డీజే క‌లెక్ష‌న్స్ అంతా త‌ప్పుల త‌డ‌క అని చూపించింది. అస‌లు క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌ను సేక‌రించి సినిమా విడుద‌లైన వారంలోపే నిర్మాత‌లు ప్ర‌క‌ట‌న‌ల రూపంలో తెలియ‌జేస్తున్న క‌లెక్ష‌న్స్ త‌ప్పంటూ పెద్ద క‌థ‌న‌మే రాసింది. స‌రే అంత వ‌ర‌కు బాగానే ఉంది. `స్పైడ‌ర్` సినిమా విడుద‌లైంది. ఈ సినిమా విడుద‌ల ఆట నుండే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. కానీ నిర్మాత‌లు సినిమా 12 రోజుల్లోనే 150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంద‌ని పెద్ద యాడ్ ఇచ్చుకున్నారు. ఈ క‌లెక్ష‌న్స న‌మ్మ‌ని సద‌రు ఆంగ్ల పత్రిక రిపోర్ట‌ర్ ఒక‌రు అస‌లు కలెక్ష‌న్స్ వివ‌రాల‌ను రాబ‌ట్టి, పై స్థాయికి చెప్పి స్పైడ‌ర్ క‌లెక్ష‌న్స్ గురించి ఓ క‌థ‌నం రాద్దామ‌ని అన్నార‌ట‌. అయితే..స‌ద‌రు ప‌త్రికా యాజ‌మాన్యం మాత్రం `స్పైడ‌ర్` విష‌యంలో క‌థ‌నం రాయ‌డానికి ఆస‌క్తి చూప‌లేద‌ట‌. అందుకు కార‌ణం న‌మ్ర‌తేన‌ని అంద‌రూ అంటున్నారు. స్పైడ‌ర్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో న‌మ్రత అతి చేస్తుంద‌ని, దీని ప్ర‌భావం మ‌హేష్ త‌దుప‌రి సినిమాల‌పై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.