క్యాథ‌రిన్ స్థానంలో మ‌రో...


త‌మిళ చిత్రం `భోగ‌న్‌`ను తెలుగులో నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే . తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నాడు. అరవింద‌స్వామి విల‌న్‌గా చేస్తున్నాడు. ర‌వితేజ స‌ర‌స‌న ముందుగా క్యాథ‌రిన్ థ్రెసాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు లెక్క‌లు మారిపోయాయి. క్యాథ‌రిన్ స్థానంలోకాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌బోతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి క్యాథ‌రిన్ స్థానంలో కాజ‌ల్‌ను ఎందుకు తీసుకోవాల‌నుకుంటున్నారనే దాని వెనుక కార‌ణాలు తెలియ‌లేదు. త‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్, తెలుగు వెర్ష‌న్‌ను కూడా డైరెక్ట్ చేస్తాడు. రామ్ తాళ్లూరి సినిమాను నిర్మిస్తారు. `నేనే రాజు నేనే మంత్రి` త‌ర్వాత క్యాథ‌రిన్‌కు వ‌చ్చిన మ‌రో మంచి అవ‌కాశం ఈ చిత్ర‌మ‌ని చెప్పాలి. కానీ, అవ‌కాశం పోవ‌డం క్యాథ‌రిన్‌కు కాస్తా బాధాక‌ర‌మే.