బాల‌య్య కూడా ఇక అది చేస్తాడ‌ట‌...


సాధార‌ణంగా స్టార్ హీరోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు అభిమానుల హ‌డావిడి ఎక్కువ‌గా ఉంటుంది. జ‌నం మీద ప‌డిపోతుంటారు. కాబ‌ట్టి వీరు ఎక్కువ‌గా బౌన్స‌ర్స్‌పై ఆధార‌ప‌డుతుంటారు. అలా బౌన్స‌ర్స్ హ‌డావిడి లేకుండా జ‌నంలో తిరిగే హీరో ఎవ‌రైనా ఉన్నారా? అంటే బాల‌కృష్ణ పేరే విన‌ప‌డుతుంది. అయితే ఈ మ‌ధ్య బాల‌కృష్ణ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే అభిమానుల‌ను కొడుతున్నాడ‌ని మీడియాలో వార్త‌లు ఎక్కువ‌య్యాయి. బాల‌య్య దురుసుత‌నం కూడా క‌న‌ప‌డుతుంద‌నుకోండి. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే, కొన్ని సంద‌ర్భాల్లో బాల‌య్య దురుసుగా ఉండ‌టానికి కార‌ణం, అభిమానులేన‌ట‌. బాల‌య్య జ‌నంలోకి వ‌చ్చిన‌ప్పుడు వారు మీద ప‌డిపోవ‌డం, కాళ్లు తొక్క‌య‌డం వంటి ప‌నులు చేస్తార‌ట‌. అలా హ‌ద్దు మీరి చొర‌వ తీసుకుంటే బాల‌య్య‌కు అది ఇష్టం ఉండ‌ద‌ట‌. అందుక‌నే చేయి చేసుకుంటాన‌ని త‌న స‌న్నిహితులు ద‌గ్గ‌ర చెప్పాడ‌ట బాల‌కృష్ణ‌. త‌న‌కు అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌ట‌మే ఇష్ట‌మ‌ని, గ‌తంలో బౌన్స‌ర్స్ త‌న‌కు ఉండేవారు. అయితే ఓసారి ఓ బౌన్స‌ర్ అభిమానిని కొట్ట‌డం త‌న‌కు న‌చ్చ‌క‌, బౌన్స‌ర్స్‌ను పెట్టుకోవ‌డం మానేశార‌ట‌. అయితే మీడియాలో తాను అభిమానుల‌పై చేయి చేసుకుంటున్న‌ట్లు వార్త‌లు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో బాల‌య్య బౌన్స‌ర్స్‌ను పెట్టుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌న్నిహితుల కొంద‌రంటున్నారు.