ఆ పాత్ర‌లో ఫైర్ బ్రాండ్‌...


సినిమాల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన రోజా, త‌ర్వాత రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మ‌హిళా విభాగంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఈ విష‌యాల‌ను ప‌క్కన పెడితే,రోజా ఇప్పుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించ‌బోయే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఈ విష‌యంపై రామ్‌గోపాల్ వ‌ర్మ‌కూడా స్పందించారు కానీ, రోజా విష‌యంపై ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ సినిమాను వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయ‌కుడు కిషోర్ నిర్మిస్తుండ‌టంతో సినిమాకు రాజ‌కీయ రంగు పులుముకుంది. అస‌లు వ‌ర్మ ఈ సినిమాలో ఏ విష‌యాల‌ను చూపిస్తారో తెలియడం లేదు కానీ హాట్ టాపిక్ మూవీగా వార్త‌ల్లో నిలిచింది. ఎన్టీఆర్ రాజకీయ వెన్నుపోటుకు గురైన విష‌యం ఇందులో చూపిస్తారా అనేది తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. అయితే రోజా ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కూడా అనిపించ‌వ‌చ్చు. అయితే రోజా అయితే ఆ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని, పొలిటిక‌ల్ అంశాలు సినిమాలో ఎక్కువ‌గా ఉంటాయి, ల‌క్ష్మీపార్వ‌తి యాంగిల్‌లో సినిమా ఉంటుంది. రేపు రాజ‌కీయంగా ఎదురయ్యే ప్ర‌శ్న‌ల‌ను కూడా రోజా చ‌క్క‌గా ఫేస్ చేస్తుంద‌ని కొంద‌రి వాద‌న‌.