అస‌లు మ‌హేష్ చుట్టూ ఏం జ‌రుగుతుంది?


సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌..ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల్లో ఒక‌డు. బాక్సాఫీస్‌ను షేక్ చేసే స‌త్తా ఉన్న అతి త‌క్కువ మంది హీరోల్లో అగ్ర గ‌ణ్యుడు. కానీ మ‌హేష్‌కు టైమ్ అస‌లు బావున్న‌ట్లు క‌న‌ప‌డ‌టం లేదు. మహేష్ గత రెండు చిత్రాలు బ్రహ్మోత్సవం, రీసెంట్‌గా విడుద‌లైన స్పైడ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మ‌హేస్ భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ మ‌హేస్ త‌దుప‌రి చేయ‌బోయే సినిమా విష‌యానికి వ‌స్తే, మ‌హేష్ త‌దుప‌రి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసింది. ఇందులో హీరోయిన్ విష‌యంలో పెద్ద లాబీయింగే జ‌రుగుతుంద‌ని అంటున్నారు. వివరాల్లోకెళ్తే..ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకున్నారు. అయితే రీసెంట్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు విన‌ప‌డింది. కాగా ఇప్పుడు శృతిహాస‌న్ పేరు కూడా విన‌ప‌డుతుంద‌ట‌. అందుకు బ‌లాన్నిస్తూ రీసెంట్‌గా శృతిహాస‌న్ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లిని, దిల్‌రాజుని క‌లిసింద‌ట‌. ఇంత‌కు హీరోయిన్‌గా ఎవ‌రు ఫైన‌లైజ్ అవుతారో చూడాలి.