శ‌ర్వా ప్రాజెక్ట్ అట‌కెక్కింది..


వ‌రుస విజయాల‌ను సాధిస్తున్న‌యంగ్ హీరో శ‌ర్వానంద్ రీసెంట్‌గా మ‌హానుభావుడుతో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. త‌దుప‌రిగా సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాతో పాటు ద‌ర్శ‌కేంద్రుడి త‌న‌యుడు కె.ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయాల్సి ఉంది. దీనికి ప్ర‌సాద్ దేవినేని, శోభు యార్ల‌గ‌డ్డ నిర్మాత‌లుగా అనుకున్నారు. కానీ లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం శ‌ర్వా కొత్త సినిమాల్లో బాహుబ‌లి నిర్మాత‌ల‌తో కె.ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయిందట‌. అందుకు కార‌ణాలేమిట‌నేది ఇంకా తెలియ‌రాలేదు. ఇప్పుడు శ‌ర్వానంద్ సుధీర్ వ‌ర్మ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు